BABY CARE TIPS | ఇంట్లో పిల్లలు తిన్నా తినకున్న నీరసంగా ఉంటారు. పిల్లలను శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా దృఢంగా ఉంచడం చాలా ముఖ్యం. అన్ని వయసుల పిల్లలు కొన్ని పనులు చేసేలా వారిని ప్రోత్సహించాలి, అలాగే తల్లిదండ్రులు కూడా చేయాలి. వాటి వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా చురుకుగా తయారవుతారు.
పిల్లల ఆరోగ్యానికి అవుట్ డోర్ ప్లే చాలా ముఖ్యం. ఆరుబయట శారీరక శ్రమలో పాల్గొనడం ద్వారా శారీరకంగా చురుకుగా ఉంటారు. ఆటలు, సైకిల్ తొక్కడం, పార్కులో నడవడం వంటివి చేయాలని వారిని ప్రోత్సహించాలి. నిజానికి పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు.. అందుకే చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలు, పెద్ద వారి కోసం వారికి నచ్చిన పుస్తకాలను కలిసి చదువుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ప్రశ్నలు అడగడం, చివర్లో కథ గురించి అడగడం ద్వారా వారి పార్టిసిపేషన్ ను ప్రోత్సహించవచ్చు.
డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ లు లేదా బ్లాక్‌లను నిర్మించడం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పిల్లలను నిమగ్నం చేయాలి. ఇవి వారిలో సృజనాత్మక నైపుణ్యాలను పెంచుతాయి. ఇంటి చుట్టుపక్కల వయస్సుకు తగిన పనులు, బాధ్యతల్లో పిల్లలను నిమగ్నం చేయాలి. ఇది వారికి ఆర్గనైజేషన్, టీమ్ వర్క్, జవాబుదారీతనం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్పుతుంది. గదిని చక్కబెట్టడం, టేబుల్‌ను అమర్చడం.. ఇంట్లో చిన్న చిన్న పనులు చెయ్యడం చేయించాలి..
కుటుంబ సమేతంగా కలిసి తినడం మంచి అలవాటు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలోపేతం కావడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించవచ్చు. కనీసం రోజులో ఒక పూట కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.. అప్పుడు ఏదైనా ముఖ్యమైన విషయాల గురించి వారికి పదే పదే చెప్పాలి.. ఇలాంటివి తరచూ చేస్తూ ఉంటే పిల్లలు చురుగ్గా తయారవుతారు.