RAJA SINGH | హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ స్వాభిమాన్ సభకి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి మాట్లాడారు. కానీ.. ఈ సమావేశానికి రాజా సింగ్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
బీసీలకు భరోసా కల్పించే ఏకైక పార్టీ బీజేపీ అని, బీసీల అభివృద్ధికి పాటుపడుతుందని ప్రధాని పదే పదే చెబుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అధికార బీఆర్ఎస్ పై బండి సంజయ్, కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీసీని సీఎంగా ప్రకటించిన బీజేపీ.. బీసీల స్వాభిమాన్ సభకి రాజా సింగ్ రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మహ్మద్ ప్రవక్త గురించి నోరుజారిన రాజ్సింగ్ను చాలా రోజులు బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే ఎట్టకేలకి చివరి క్షణంలో సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ సమావేశానికి RAJA SINGH హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే దీనిపై రాజా సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సభకు హాజరైతే ఖర్చు మొత్తం ఎన్నికల ఖర్చు కిందకే వస్తుందని, అందుకే తాను హాజరు కాలేదని, టీవీల్లోనే చూడాల్సి వచ్చిందని వీడియో విడుదల చేశారు. తన ముఖ్య కార్యకర్తలతో కలిసి టీవీల్లో ప్రధాని ప్రసంగాన్ని చూడాల్సి వచ్చిందన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విడుదల చేసిన వీడియోలో తెలిపారు. ఎల్బీ స్టేడియం ఆయన నియోజకవర్గం. అంతేకాకుండా బీసీ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. మరి ఈ సమావేశానికి ఆయన ఎందుకు రాలేదు?. రాజ్సింగ్ను బీజేపీ నేతలు పట్టించుకోరా? కనీసం కాన్ఫరెన్స్ కాల్ లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గోషా మహల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజాసింగ్. 2018 ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు