FRIDGE WATER | ఇంట్లోని ఫ్రిజ్లో చల్లని నీరు తాగాలంటే మనలో చాలా మందికి సరదా. కానీ.. ఆ నీరు నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అవును, మీరు ఎండ నుండి నీడకు వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగినప్పుడు పేగులు కుచించుకుపోతాయి. అలాగే, పొత్తికడుపు నొప్పి ఏర్పడుతుంది. తద్వారా మలబద్ధకం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది. ఇది మీకు గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే చల్లని నీరు పొట్టను బిగుతుగా చేస్తుంది. ఎక్కువ సేపు చల్లటి నీరు తాగడం వల్ల బ్రెయిన్ ఫ్రీజ్ సమస్య కూడా వస్తుంది. చల్లటి నీరు నరాల్లోకి చేరిన వెంటనే మెదడుకు సందేశాలు పంపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది తలనొప్పి సమస్యను కలిగిస్తుంది.
చల్లని నీరు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియ వ్యవస్థ మందగిస్తుంది. దీంతో కొవ్వును సరిగా విడుదల చేయలేరు. కొన్నిసార్లు ఇది బలహీనత, అలసటను కూడా కలిగిస్తుంది
చల్లని నీరు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియ వ్యవస్థ మందగిస్తుంది. దీంతో కొవ్వును సరిగా విడుదల చేయలేరు. కొన్నిసార్లు ఇది బలహీనత, అలసటను కూడా కలిగిస్తుంది.