GIRLS | ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కాదు.. ఒంటరిగా ఉన్నప్పుడే మాత్రమే మన నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. కొన్నిసార్లు మీరు అందరి ముందు అన్ని పనులు చేయాలని అనిపించదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు చేసేది తమకు ఇష్టమైన పని అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారో తెలుసా..?
చాలా మంది మహిళలకి పాటలు వినడమే కాదు పాడటం కూడా ఇష్టం. అయితే అందరి ముందు పాడడం వారికి ఇష్టం ఉండదు. కాబట్టి.. పాటలు పాడటమే కాదు.. వాటిని రికార్డ్ చేసుకుని మరీ వింటారు. ఇక నిద్రని కూడా వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిలు తాము అందంగా ఉండటానికి రకరకాల పోజులతో ఫోటోలు తీసుకోవడం వాటిని చూడటాన్ని బాగా ఆస్వాదిస్తారు. అంతేకాదు తమని తాము పొగుడుకుంటుంటారు. ఇక ఫ్రిజ్‌లో ఏముందో.. లేదో అని ఫ్రిజ్‌ని తెరిచి తెరిచి తరచూ చూస్తుంటారు.
సాధారణంగా ఒంటరిగా ఉన్నప్పుడు వంట చేయడం, గిన్నెలు కడుక్కోవడం లాంటివి చేయకుండా సంతోషంగా తమకు నచ్చినవి ఆర్డర్ చేస్తుంటారు. పిజ్జా, బర్గర్లకు కూడా అందులో చోటు ఉంటుంది. ఇక అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారికి కొన్నిసార్లు భయం ఉంటుంది. ఏదైనా శబ్దం వింటే దగ్గరకు వెళ్లి చూసే ధైర్యం లేకపోయినా కాసేపు అలానే ఉండి.. అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలానే ఇష్టమైన సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చూస్తారు. వారు తమ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వీడియోలు చూస్తూ గంటల తరబడి గడుపుతారు. అందరు స్త్రీలు ఇలా చేయరు. అయితే చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు ఇవేనని పరిశోధనలు చెబుతున్నాయి.