KOMATIREDDY RAJAGOPAL REDDY | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. దాంతో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లని పరిశీలిస్తే అత్యంత ధనిక ఎమెల్యే అభ్యర్థిగా KOMATIREDDY RAJAGOPAL REDDY నిలిచారు.
నిజానికి ఆయన మొన్న నామినేషన్ టైమ్ మర్చిపోయి ప్రచారంలో ఉండిపోయారు. కానీ.. ఆఖరి నిమిషంలో గుర్తొచ్చి పరుగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
రాజగోపాల్రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ. 458 కోట్లుగా తేలింది. అందులో.. రూ.297.36 కోట్ల చరాస్తులుండగా.. నగదు, బ్యాంకు డిపాజిట్లు, సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్లో రూ.239.31 కోట్ల విలువ కలిగిన షేర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అలానే వ్యవసాయ, వ్యవసాయ, వ్యసాయేతర భూములు, వాణిజ్య భవనాలు ఇవన్నీ కలిసి రాజగోపాల్ రెడ్డికి రూ.108.23 కోట్ల స్థిరాస్తులుండగా.. ఆయన భార్యకు రూ.48.60 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇక అప్పుల విషయానికొస్తే.. కేవలం రూ.4.14 కోట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. 2018లో సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులన్ని కలిపి.. రూ. 314 కోట్లుగా ప్రకటించగా.. ఆయన నికర విలువ 45 శాతానికి పైగా పెరిగినట్టు తెలుస్తోదంది. అంతకు ముందు 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో.. కేవలం రూ. 66 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు