BACTERIA | సాధారణంగా మన ఇంట్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఠక్కున అందరూ చెప్పే ప్రదేశం ఒక్కటే.. అదే టాయిలెట్. కానీ.. టాయిలెట్ సీట్ కాకుండా అంతకంటే ఎక్కువ బ్యాక్టీరియా మన ఇంట్లోని కొన్ని వస్తువులపై ఉంటుంది. కానీ ఆ విషయాలను మనం పట్టించుకోము. తెలిస్తే వాటిని తాకడానికి మనం కచ్చితంగా ఆలోచిస్తాం. ఎందుకంటే వాటిని పదేపదే తాకడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
కంప్యూటర్‌తో పనిచేసేటప్పుడు కీబోర్డ్‌ని ఉపయోగిస్తాం. చాలా మంది ఆహారాన్ని కంప్యూటర్ ముందు పెట్టుకుని తింటారు. దీనితో పాటు.. వారు కీబోర్డ్‌ను కూడా టచ్ చేస్తూ ఉంటారు. అయితే టాయిలెట్ బౌల్లో కంటే కంప్యూటర్ కీబోర్డ్‌లో దాదాపు 5 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈరోజుల్లో ఫోన్ లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్‌ని వెంట తీసుకెళ్తాం. బాత్రూమ్లో కూడా చాలా మంది ఫోన్‌ని ఉపయోగిస్తున్నారు. ఫోన్ వాడుతున్నప్పుడు ఎక్కడైనా ఉంచుతాం. కానీ అది మురికితో నిండి ఉందని మీకు తెలుసా. ఒకసారి చెక్ చేసి చూడండి.
టీవీ రిమోట్లో కూడా టాయిలెట్ సీట్లో కంటే ఎక్కువ మురికి కనిపిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు తరచుగా టీవీ రిమోట్‌ని ఉపయోగించండి. అలానే సోఫా కుషన్ల మధ్య విసిరేస్తాము. ఈ ప్రదేశాల్లో బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఫోన్, కీబోర్డు, రిమోట్‌ని తరచూ శుభ్రం చేయండి.