GUVVALA BALARAJU | తెలంగాణలో పోలింగ్ సమీపిస్తున్నకొద్దీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరింతగా అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడి మరిచిపోకనే, అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. దాంతో బీఆర్ఎస్లో కొత్త కలవరం మొదలైంది.
అచ్చంపేటలో బీఆర్ఎస్ నాయకులు కారులో డబ్బు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కారులో డబ్బు సంచులున్నాయని, స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కారును అడ్డుకున్నారు. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుకు ఆ పార్టీ కార్యకర్తలు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో అక్కడికి బాలరాజు చేరుకోగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పరస్పరం రాళ్లు, కర్రల దాడికి దిగే పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్త విసిరిన రాయి ఎమ్మెల్యే GUVVALA BALARAJU ముఖానికి తగిలింది. రక్తగాయం కావడంతో ఆయన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.