EAR PHONES | ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు. కానీ.. అతిగా వాడితే ఆరోగ్య ప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోతున్నాయి. చెవుల్లో రోజంతా ఉండాల్సిందే.. లేకపోతే, చాలా మంది ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. ఆఖరికి శబ్ధాలు దగ్గరుండి వినడం వల్ల వారిపై ఒత్తిడి రావడంతో వినికిడి సమస్యలు వస్తున్నాయి. అవి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి.
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లోతుగా పరిశోధన చేసింది. యువత వినికిడి సమస్యకు ప్రధాన కారణం ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడమేనని అన్నారు. వీటిని అతిగా వాడితే సమస్య పెరుగుతుందని నిర్ధారణ అయింది. నిజానికి 50 ఏళ్ల తర్వాత సహజంగానే వినికిడి సమస్యలు వస్తాయి. అయితే ఇప్పుడు 20 ఏళ్లకే ఈ సమస్యలు వస్తున్నాయి.. దీనికి ప్రధాన కారణం చిన్నప్పటి నుంచి శబ్దానికి అతిగా అలవాటు పడటమే.
ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతుంది. ఎంతలా అంటే నలుగురిలో ముగ్గురుకి వినికిడి సమస్యలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది యువకులు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది చెవిటితనంతో బాధపడుతున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇయర్ ఫోన్స్ వాడే అలవాటు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అరగంట పాటు వీటిని వాడాలనుకుంటే పది నిమిషాల పాటు చెవులకు బ్రేక్ ఇవ్వండి లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.