KONDA SUREKHA | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎక్కువగా ఆసక్తి రేపుతోంది. తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కొండా దంపతులు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు టెన్షన్ పుట్టిస్తుంది.
హోరాహోరీగా తూర్పులో పోరు సాగుతుండడంతో పాటు, కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసలతో , మరో అయిదారుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవ్వడంతో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కుదేలవుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వేస్తున్న ఎత్తుగడలు బిఆర్ఎస్ పార్టీని కుదేలు చేస్తున్నాయి.
తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్న ఆయన నన్నపునేని నరేందర్ పై తీవ్ర అసహనంతో ఉన్న కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారు. తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కార్పొరేటర్లను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.