WALKING BAREFOOT | మనం పొద్దున్న నిద్రలేచిన దగ్గర్నించి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అసలు చెప్పులు లేకుండా అనేది ఊహించలేం. కేవలం దేవాలయానికి వెళ్లినప్పుడు, ఇంట్లో మందిరానికి వెళితే తప్ప చెప్పులు తీయం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు. ఇలా చేయడం మంచిదేనా అని ఆలోచించండి. చెప్పులు విప్పి నడవడం అనేది కష్టమయినదే. కానీ అసాధ్యం మాత్రం కాదు.
మన ఆరోగ్య కారణాల వల్ల మనం ఖచ్చితంగా పాదాలకు పాదరక్షలు లేకుండా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.. ఇంటి పని.. ఆఫీసు పనితో నిత్యం బిజీ ఉండే గృహిణి తన ఆరోగ్యం పట్ల చూపించే శ్రద్ధ కాస్త తక్కువేనని చెప్పాలి. పిల్లల చదువు బాధ్యత కూడా ఆమె పైనే పడుతుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా పోతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో వ్యాయామానికి వారికి సమయం దొరకడం కాస్త కష్టమే. అందుకే నడిచేటప్పుడు చెప్పుల్లేకుండా నడిస్తే ఒత్తిడి మాయమై ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఖరీదైన చెప్పులు వేసుకుని నడవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది ధరించే చెప్పుల వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. పాదాలకు సరైన వ్యాయామం లభించడం లేదు. చెప్పులు లేకుండా నడవడం వలన పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులు ఉండవు.. చెప్పులు లేకుండా నడిస్తే కీళ్ల నొప్పులు వుండవు. చెప్పులు లేకుండా నడపడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పాదాల కింద ఉండే నరాలు ఉత్తేజితం అవుతాయి. కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. చెప్పులు లేకుండా నడిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు కొంచెం సమయం చెప్పులు లేకుండా నడిస్తే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఇలా నడవడం వల్ల తరచూ వేధించే నిద్రలేమి సమస్య ఉండదు..చెప్పులు లేకుండా నడవడం వలన మీ బాడీ రిలాక్స్ అవుతుంది. దీనితో నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. శరీరం అలసిపోవడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. కండరాలు బలంగా ఉంటాయి..చెప్పులు లేకుండా నడవడం వలన కండరాలు దృఢంగా మారుతాయి ఇలా ఇన్ని లాభాలను మీరు పొందొచ్చు. కనుక చెప్పులు లేకుండా నడుస్తూ ఉండండి దానితో ఈ సమస్యలకి మనం చెక్ పెట్టడానికి వీలవుతుంది.