CARROT | క్యారెట్ని చాలా మంది ఇష్టపడరు. కానీ.. ఆ క్యారెట్లో ఉండే సుగుణాలు బహుశా ఎందులోనూ ఉండవేమో. క్యారెట్ వంటకం గాను జ్యూస్ గాను మరియు పచ్చిగానే తినడానికి ఎంతో బాగుంటుంది. కానీ.. ఎందుకో పిల్లలు అయిష్టత చూపుతుంటారు. ఇందులో విటమిన్ ఎ,బీ,సీ,ఈ లతో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, సోడియం, మాంగనీస్, ఆయోడిన్ ఉండి శరీరానికి ఎంతో ఉపయోగపడే కాల్షియాన్ని అందిస్తుంది.
క్యారెట్ రోజూ తింటే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త పోటును కంట్రోల్లో ఉంచడం ద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది. సహజంగా క్యారెట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కళ్ళకి మంచిది అని. ఇందులో ఉండే విటమిన్ ఎ అన్ని రకాల కంటి సమస్యలను దూరం చేస్తుంది. రోజూ క్యారెట్ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ కూడా నిరోధించే గుణాన్ని కలిగి ఉంది. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్ పెడుతుంది.
రోజూ క్యారెట్ జ్యూస్ తీసుకోవటం ద్వారా వెంట్రుకలు కుదుళ్ల నుండి గట్టిపడతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలె సమస్య తగ్గుతుంది. క్యారెట్లో ఉండే విటమిన్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంపై ఏర్పడ్డ మృతకణాలను తిరిగి పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలానే నిగనిగ లాడే చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.