హలో.. నేను మున్సిపల్ ఆఫీస్ బిల్ కలెక్టర్ ను మాట్లాడుతున్నాను.. మీ ట్రేడ్ లైసెన్స్ బాకీ ఉంది.. వెంటనే చెల్లిస్తారా లేక మీ షాప్ సీజ్ చేయాలా..? అని ఇంటిపేరు, ఊరు పేరు, షాప్ పేరు, షాప్ నెంబర్ తో సహా చెప్పి ఘరానా దోపిడీలకు తెర లేపారు కేటుగాళ్లు. కొందరు వ్యాపారులు ఆ కేటుగాళ్ళ బెదిరింపులు అంతా సెల్ ఫోన్ లో ఆడియో రికార్డు చేయడంతో అసలు బండారం బయటపడింది. మున్సిపాలిటీలో ఇంటి దొంగలపై అనేక […]
ఏలూరు జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఓ పసికందు మృతదేహం పడి ఉండటంతో కలకలం రేగింది. ఆసుపత్రి ప్రాంగణంలో రద్దీగా ఉండే ప్రాంతంలో వాహనాల మధ్య పసికందు మృతదేహం పడి ఉండటం చూపరులను కలచివేసింది. ఆసుపత్రిలో ప్రసవం అనంతరం ఆడబిడ్డ పుట్టిందని వదిలించుకున్నారా.. లేదా బయట ప్రసవం అనంతరం తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంకు […]
మద్యానికి బానిసైన ఓ యువకుడు కన్న తల్లిపైనే పెట్రోలు పోసి తగులబెట్టిన సంఘటన అనంతపురం జిల్లా, మండల కేంద్రమైన కంబదూరులో చోటు చేసుకుంది. కంబదూరుకు చెందిన సుజాత, గోపిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లిద్దరికీ పెళ్లి చేయడంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ వరకు చదివిన కొడుకు ప్రణీత్ కొంతకాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. ఉపాధి పేరుతో నగరాలకు తిరుగుతూ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికొచ్చి వెళ్లేవాడు. కొద్దిరోజులు పనిచేసి వచ్చిన డబ్బుతో జల్సా చేసి మళ్లీ […]
వినాయక చవితి పర్వదినాన ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన సాయితేజకి తన తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణిచడంతో ఆయన స్థానంలో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే, మద్యానికి బానిసైన యువకుడు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై నర్సాపూర్ ఆర్టీసీ డీపో సమీపంలో పెట్రోల్ […]
వేరే కులం వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో తోడబుట్టిన సోదరిని ఇద్దరు సోదరులు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. భయంతో దాక్కున్నా.. వెతికి మరీ హతమార్చారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మాయత్ చంద్రకళ అనే యువతి వేరే కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. దీన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో […]
నానాటికీ సైబర్ మోసాలకు కేటుగాళ్లు కొత్త మార్గాలు సృష్టిస్తూనే ఉన్నారు. సాధారణంగా మొబైల్ ఫోన్లో వచ్చే OTPని ఎవరైనా అపరిచితులతో పంచుకుంటే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే సందర్భాలు ఇప్పటి వరకూ చాలానే చూశాం. ఐతే ఓటీపీ లేకుండా కేవలం వేలిముద్ర సహాయంతో ఆధార్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును దొంగిలించారు. ఈ సంచలన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కర్నాటకలో ఈ తరహా మోసం తొలిసారి వెలుగు చూసింది. మోసపోయిన […]
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ కు బానిసగా మారిన ఓ ప్రైయివేట్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఏకంగా 8.5 కోట్ల రూపాయలు కాజేశాడు. 128 మంది ఖాతాదారుల పేరిట కాజేసిన సొమ్మంతా అన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టి పోలిస్ విచారణలో తెల్ల ముఖం వేశాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఐసిఐసిఐ బ్రాంచ్‌లో ఈ ఘరానా మోసం జరిగింది. 2019 నుండి 2023 వరకు ఈ బ్రాంచ్ లో రూ.8 కోట్ల 65 లక్షల రూపాయలు తేడా […]
రోడ్డు పక్కన.. రద్దీ ప్రాంతాల్లో నడుస్తూ వెళ్తుంటే పర్సు.. దాన్నుంచి సగం బయటకొచ్చిన రూ.500 నోటు కనిపించిందా? ఇదెవరో పోగొట్టుకున్నది కాదు.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన పాంప్లెట్. అచ్చం డబ్బులున్న పర్సులా కనిపించేలా తయారుచేసిన ఈ కరపత్రాల్ని రహదారుల వెంట.. జనం అధికంగా ఉండే మెట్రో, బస్స్టేషన్ల దగ్గర రహదారులపై జారవిడుస్తున్నారు. ఎవరైనా పొరబడి ఆ పర్సును అందుకుని చూడగానే కరపత్రం తెరుచుకుంటుంది. సైబర్ నేరాల బారినపడితే […]
పింఛను పంపిణీలో ఓ మహిళా వాలంటీరు చేతివాటం ప్రదర్శించారు. వైయస్ఆర్ జిల్లా చెన్నూరు మండలం కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన నాగేష్ రెండేళ్ల కిందట సామాజిక పింఛను కోసం స్థానిక వాలంటీరు అను వద్ద దరఖాస్తు చేశారు. తొలుత మంజూరైనా నగదు చెల్లించలేదు. సమస్యను స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెండు నెలల కిందటే ఆయనకు కొత్తగా పింఛను మంజూరైంది. తమ వల్లే పింఛను మంజూరైందని, రూ.3 వేలు చెల్లించాలని వాలంటీరు కోరారు. అంత మొత్తం ఒక్కసారిగా […]
అర్ధరాత్రి గోడ దూకి ఓ ఇంట్లోకి దూరిన దొంగలు దొరికినకాడికి దోచుకెళ్లారు. చోరీ చేసిన సొత్తును ఎత్తుకెళ్లారు.. కానీ, దొంగతనానికి వచ్చిన వారిలో ఒక దుండగుడు.. తన చెప్పులు అక్కడే మర్చిపోయాడు. సగం దూరం వెళ్లాక చెప్పులు మర్చిపోయాననే విషయం గుర్తుకు వచ్చింది. దాంతో అతడు వేగంగా వెనక్కి పరిగెత్తి చెప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. అంతలోనే గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని దేహాశుద్ధి చేశారు. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో వెలుగు చూసింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి […]