‘చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటాడో సినీ కవి. ఎందుకంటే సింగారమనే దారంతో, ఆనందం ఆనే రంగులతో, మమకారమనే మగ్గంపై నేస్తారు చీర. ఆ చీరను కట్టుకొని మడికట్టుతో పూజచేస్తే గుడి వదిలి ఆ దేవుడే దిగడస్తాడని…ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే పంటలు సిరిలక్ష్మిని కరిపిస్తాయని నమ్మకం. అంతేకాదు ‘అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది, కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది, చిన్న చీరకొంగేరా అని ఆత్మీయతను […]
తల్లి న్యాయవ్యవస్థ విభాగ ఉద్యోగిని.. తండ్రి బీహెచ్ఈఎల్లో డ్రాఫ్ట్‌మెన్.. కుమార్తె ‘మిస్ టీన్ ఇండియా’ అందగత్తె విశాఖపట్నం, న్యూస్‌లీడర్: విశాఖ అందాల సిరిలో మరో అందగత్తె మెరిసింది. తల్లి న్యాయవ్యవస్థ విభాగంలో ఉద్యోగిని. తండ్రి బీచ్ఈఎల్ ఇంజినీరింగ్ విభాగంలో డ్రాఫ్ట్స్‌మెన్. కుమార్తె మిస్ టీన్ ఇండియా పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. అన్నీ అనుకూలిస్తే ఆమె మిస్ ఇండియా కూడా కావచ్చు. అందుకు ఆమె కూడా కసరత్తులు చేస్తున్నారు. విశాఖ నగరానికి పేరు తెచ్చేందుకు ఇప్పటి నుంచే […]
న్యూ ఢిల్లీ, న్యూస్‌లీడర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగీత నాటక అకాడమీ అమృత అవార్డులకు ఎంపికయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఇస్తున్న ఈ అవార్డుకు దేశవ్యాప్తంగా 75 మంది కళాకారులను ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పండితారధ్యుల సత్యనారాయణ(హరికథ), మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి(కూచిపూడి), మహాభాష్యం చిత్తరంజన్(సుగమ్ సంగీత్), తెలంగాణకు చెందిన బాసిని మేరెడ్డి(థియేటర్), కొలంక లక్ష్మణ్‌రావు(మృదంగం), ఒగ్గరి ఐలయ్య(ఒగ్గుకథ) ఉన్నారు. పురస్కారంలో భాగంగా తామ్రపత్రంతో […]
విశాఖపట్నం: ఏపీ చాంబర్స్ ఉమెన్స్ వింగ్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 25న విశాఖలోని హోటల్ మేఘాలయలో ‘అంగడి’ పేరిట ఉమెన్ ఎంట్రపెన్యూర్ ఎక్స్పో నిర్వహించనుంది. ఆదివారం ఉదయం 10నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రారంభించనున్నారు. మహిళల్నీ వ్యాపార వేత్తలుగా మార్చాలనే ధ్యేయంతో పాటు మగువలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. […]
ఆయన రచించిన ‘నవంబర్ నెలలో వర్షం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్: ఈ నెల 28న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ మాణిక్యం పురస్కార ప్రదాన సభ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరు కానున్నట్టు ప్రముఖ కవి యాకూబ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా 2020ఏడాదికి […]
అద్భుతమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, గొప్ప సన్నివేశాలు, అపురూప సంఘటనలు, మనసు దోచే దృశ్యాలు, ఆలోచింపజేసే రూపాలు… అరుదైన చిత్రాలు… వెరసి ఫొటోగ్రఫీ. వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పడం సాధ్యం. అంతటి శక్తివంతమైనది ఫొటోగ్రఫీ. అలాంటి శక్తిని వశం చేసుకుని ఫోటోతో అద్భుతాలు సృష్టించిన కెమెరా మాంత్రికుడు బండి రాజన్ బాబు. కెమెరాకే ట్రిక్కులు నేర్పిన నేర్పరి […]
‘జిప్మర్’ స్నాతకోత్సవంలో అందజేత పాండిచేరి: విశాఖకు చెందిన చిన్నపిల్లల అత్యవసర సేవల వైద్య నిపుణలు డాక్టర్ రౌతు సంతోష్‌కుమార్ (డీఎం, పెడియాట్రిక్)కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయనకు Best Outgoing Student' Award తో పాటు డాక్టర్ సత్యమూర్తి ఎండోమెంట్ ప్రైజ్ (బంగారు పతకం) కూడా లభించింది. 199ఏళ్ల చరిత్ర కలిగిన జవహర్లాల్ నెహ్రూ ఇన్సిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) సంస్థలో ఈ నెల 20న 12వ స్నానకోత్సవాన్ని […]
విజయవాడ : ఒక ఛాయా చిత్రం చెదరని జ్ఞాపకాలకు, మధుర స్మృతులకు అలవాలంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రతి ఛాయా చిత్రం వెనుక ఓ అనుభూతి నిక్షిప్తమై ఉంటుందన్నారు. ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర స్దాయి పోటీలు నిర్వహించగా వాటిలో బహుమతులు గెలుచుకున్న 13 మందిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన ఫోటో జర్నలిస్టులతో […]
తీరంలో పారిశుద్ధ్య చర్యలు ప్లాస్టిక్ నియంత్రణకు పిలుపు యస్ రాయవరం మండలం: రేవుపోలవరం తీరం.. సుమనోహర పరిసరాలకు ఆలవాలం.. పర్యాటకులకు పట్టుకొమ్మ. ఇంత సుందర ప్రాంతంలో పారిశుద్యం కుంటుపడటంతో ఈ ఊరి యువత చేతులు కలిపారు. సామాజిక సేవా దృక్పథం ప్రతి ఒక్కరూ అలవరుచుకునే దిశగా వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తీరంలో పరిసరాలను శుభ్రం చేసి ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని యువత, […]
విశాఖపట్నం: పాములు పట్టడంలో నేర్పరి స్నేక్ కిరణ్ (ఆర్.కిరణ్‌కుమార్)కు అవార్డు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. స్నేక్ సేవర్స్ సొసైటీ పేరిట ఓ సంస్థను ప్రారంభించి వేలాది పాముల్ని రక్షించడమే కాకుండా ఎన్నో కుటుంబాలను వాటి బారి నుంచి కాపాడిన ఘనత కిరణ్ది. ఈ నేపథ్యంలో సమాజ సేవలో ఆయన మరింత ఘనత సాధించాలని […]