ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో.. ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టేందుకు అధికార వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటే.. చంద్రబాబు అరెస్ట్‌తో పాటు.. ప్రజా సమస్యలపై గళం విప్పాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభంకానుంది. క్వశ్చన్ అవర్‌తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. […]
ఏపీలో స్కిల్ స్కాం కేసు హీటెక్కిస్తుంది. తాజాగా సీఐడీ చీఫ్ చూపించిన సంతకాలు, చెబుతున్న రహస్యాలు.. టీడీపీని కలవరానికి గురిచేస్తున్నాయి. లోకేష్ పాత్రపై విచారణ చేస్తామడంపై ఆ పార్టీలో అలజడి నెలకొంది. బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. వాటికి కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయనుంది సీఐడీ. దాంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు సంచలనం సృష్టిస్తుంది. నిందితునిగా మాజీ సీఎం […]
స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హైకోర్టు బుధవారం క్వాష్ పిటిషన్‌ను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చిన అనంతరం.. ఈ రోజు మా నినాదం ఇదే.. అంటూ గురు గోవింద్ సింగ్ సూక్తిని ఆయన ఉటంకించారు. ‘అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది’ అని ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ […]
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారులకు షాక్ తగిలింది. చంద్రబాబు కుటుంబం కంపెనీ ప్రధాన ప్రమోటర్ కావడంతో షేరు కుప్పకూలింది. శనివారం చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత రెండు ట్రేడింగ్ సెషన్లలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర దాదాపు 19 శాతం క్రాష్ అయ్యింది. మంగళవారం ఒక్కరోజే 12.5 శాతం (రూ.32) క్షీణించి రూ.221 వద్ద ముగిసింది. భారీ వాల్యూమ్‌తో (దాదాపు 24 లక్షల షేర్లు […]
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రమాదం ఉందని, హౌస్కస్టడీ విధించాలని ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాకు గతంలో సుప్రీంకోర్టు హౌస్ అరెస్టు విధించిందని ఉదహరించారు. దాంతో ఎవరీ గౌతం నవలఖా అనే చర్చ సర్వత్రా మొదలైంది. 2017 డిసెంబరులో పుణెలో నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాపై కేసు నమోదైంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై నమోదైన […]
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి బి.సత్య వెంకట హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. అక్కడ ఆయనను ప్రత్యేక గదిలో ఉంచాలని స్పష్టం చేశారు. జైలులో తగిన భద్రతను కూడా కల్పించాలని ఆదేశించారు. ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్ తెప్పించుకునేందుకు అనుమతించారు. న్యాయమూర్తి ఉత్తర్వులు […]
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని సీఐడీ చెబుతోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని తెలిపారు. ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. ఇక నారా లోకేష్ సైతం కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇక సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు […]
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు ఉదయం 5 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు బాబు […]
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తనని అరెస్ట్ చేస్తారంటూ చెప్పడం అధికార పార్టీకి అస్త్రంగా మారింది. సానుభూతి కోసం చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారని.. తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైసీపీ అంటోంది. అయితే దేనికైనా సిద్ధమేనంటోంది తెలుగుదేశం పార్టీ. రేపోమాపో తనను అరెస్టు చేస్తారని, లేకుంటే దాడి చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. 118 కోట్ల రూపాయల లెక్కచూపని […]
ఎర్రమట్టి దిబ్బలు కాపాడుకుంటాం వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే.. గ్రీన్ ట్రైబ్యునల్ వరకు వెళ్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 16: భీమునిపట్నం మండలంలో ఎర్ర దిబ్బలు చారిత్రార్తకమైనవని, ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని బుధవారం సాయంత్రం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు […]