ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 16 : న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ పేరును కేంద్రం తాజాగా మార్చింది. మ్యూజియం కొత్త పేరు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా ఖరారు చేసింది. ఈ మేరకు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్ నృపేంద్ర మిశ్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడిరచారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పేరును అధికారికంగా మార్చారు. ప్రజాస్వామీకరణ క్రతువులో భాగంగా ఈ మార్పు చేసినట్టు నృపేంద్ర మిశ్రా వెల్లడిరచారు. సొసైటీ […]
ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 16 : మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద వాజ్పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు.
ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఘనతకెక్కిన పాలకులు ‘ఈ ఉత్సవాలను ఆదర్శవంతంగా, జాతీయ స్ఫూర్తితో చేసుకుందాం’ అంటూ ఎప్పటిలాగే పిలుపునిచ్చారు. కానీ, దేశంలో పరిస్థితి ప్రశాంతంగా వేడుకలు చేసుకునేలా ఉందా? ఆ అవకాశాన్ని మనకు పాలకులు కల్పిస్తున్నారా? మణిపూర్ మండుతున్న వైనాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండె బాధలో రగిలిపోతోంది. అనాగరిక చేష్టలు, ఆటవిక దాడులు, ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో ఆ రాష్ట్ర ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న దుర్భర […]
.వివిధ వృత్తులకు చెందిన వారిని ఆహ్వానించిన ప్రభుత్వం .ఆహ్వానితుల జాబితాలో 400 మంది సర్పంచులు .కొత్త పార్లమెంట్ నిర్మాణ కూలీలకూ ఆహ్వానం ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 14 : భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకల కోసం వివిధ వృత్తులకు చెందిన సుమారు 1800 మంది వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ […]
` రైతన్నల సంఖ్య తగ్గితే ఇండియాకు ఇబ్బంది ` యంత్రాల వినియోగం పెంచాలి ` చిన్న, సన్నకార రైతులకు చేయూత అందించాలి ` ప్రత్నామ్నాయ రంగాల వైపు వలసలు నివారించాలి ‘‘భారతదేశం ‘వెనకబడి ఉండడానికి’ కారణం దేశంలో పెరుగుతున్న జనాభా. వ్యవసాయరంగంపై ఆధారపడిన ప్రజల సంఖ్య ఎంత తగ్గితే అంత మంచిది,’’ వంటి అభిప్రాయాలు 1960`90 మధ్య జనంలో ఉండేది. అనేక మంది నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కాలక్రమేణా.. పెరుగుతున్న జనాభా ఒక్కటే […]
.విరుచుకుపడిన విపక్షాలు .ప్రసంగంలో మొదటి 90 నిమిషాలు ‘మణిపూర్’ ఊసే లేదన్న టీఎంసీ ఎంపీ .‘ఇండియా’ విజయంపై మరింత నమ్మకం కుదిరింది .మోడీ ‘కాంగ్రెస్ ఫోబియా’తో బాధపడుతున్నారు : ఎంపీ గౌరవ్ గొగోయ్ ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 11 : మణిపూర్ హింసపై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నోరే రాలేదని విపక్షాలు మండిపడ్డాయి. అవిశ్వాస తీర్మానంపై మోడీ ప్రతిస్పందనను తప్పుబట్టాయి. 90 నిమిషాల పాటు మోడీ మణిపూర్ ఊసే ఎత్తలేదని, తాము సభ నుంచి వాకౌట్ […]
న్యూఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 10 : పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మణిపుర్ అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ‘ఈ దేశం మొత్తానికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోదీ మణిపుర్ గురించి అస్సలు ఆలోచించడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. […]
` దేశాన్ని హత్య చేశారని అంటే.. హర్షం ప్రకటిస్తున్నారే? ` రాుహుల్ గాంధీ ప్రసంగంపౖౖె స్మృతి ఇరానీ విమర్శ ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 9 : అవిశ్వాసం తీర్మానంపై చర్చలో భాగంగా రెండో రోజైన బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆక్షేపించారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. మీరు ఇండియా (విపక్ష కూటమిని ఉద్దేశించి) కాదు. ఇండియాలో అవినీతి ఉండదు. […]
` ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ ఆరోపణ ` మండిపడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 9 : అవిశ్వాసంపై జరిగిన చర్చలో తన ప్రసంగం ముగిసిన తరువాత రాహుల్ గాంధీ లోక్సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ మహిళా ఎంపీలు ఆరోపించారు. దీనిపై స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన ఇంతకుముందు చూడలేదన్నారు. రాహుల్ తీరును ఖండిస్తూ.. స్త్రీ వ్యతిరేకులు […]
` ఆ రాష్ట్రం మన దేశంలో భూభాగమే.. ప్రధాని గుర్తించడం లేదు ` మీకు చిత్తశుద్ధి ఉంటే.. అక్కడ శాంతి నెలకొనేది ` ప్రధాని ‘వారిద్దరి’ మాట తప్ప ఎవరి మాట వినరు ` అవిశ్వాసంపై చర్చలో కేంద్రంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ` ప్రధాని లక్ష్యంగా తీవ్ర విమర్శలు ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 9 : ‘మణిపూర్ మండిపోతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అక్కడకు వెళ్లలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మణిపూర్ […]