ఢిల్లీకి చేరుకున్న బీజేపీ నేతలు హైదరాబాద్, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ తెలంగాణలో బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరబోతున్నారు. బుధవారం ఉదయం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. […]
` జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ కొనసాగింపు ` ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ అధ్యక్షుడు నడ్డా ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 29 : బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను కట్టబెట్టారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఆంధ్రప్రదేశ్ […]
హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 18 తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు రెండో వారంలో జరిగే అవకాశాలున్నాయి. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనున్న నేపధ్యంలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో కొత్త బిల్లులను ప్రవేశ పెట్టకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించడానికి సవరణ బిల్లులను ప్రవేశపెట్టడం పైన దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీని సమావేశపరచాలని […]
వరంగల్, న్యూస్ లీడర్, జూలై 8Ñ దేశాభివృద్ధిలో తెలుగోడి పాత్ర కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు శనివారం వచ్చిన ప్రధాని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనులకు, రూ.3,441 కోట్లతో […]
హైదరాబాద్, న్యూస్‌లీడర్, జూన్ 28: కమ్మ, వెలమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భూములు కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూముల కేటాయింపును ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇలా కేటాయించడం కూడా ఓ విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది. కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తూ […]
హైదరాబాద్. న్యూస్‌లీడర్, జూన్ 22 : అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘అమరుల ఆశయాలే స్ఫూర్తిగా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాం. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించగలిగాం. తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే వచ్చే వందేళ్లకు బలమైన పునాది వేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతదేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మంత్రి మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున […]
‘జనగామకు రాజువని చెబుతుంటావు కదా.. నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ ఈ తప్పుడు పనులేంది నాన్నా’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి సోమవారం బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామ శివారు వడ్లకొండలో సోమవారం నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోతుండగా.. ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డి, అల్లుడు అక్కడికి చేరుకున్నారు. యాదగిరిరెడ్డి వద్దకు భవానీరెడ్డి వచ్చి.. చేర్యాల […]
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పదవులను ఊడగొడితే ఆత్మహత్య చేసుకుంటానని, లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. హైదరాబాద్‌లో జిల్లా నుంచి కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమంలో తనను అవమానించేలా మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యర్థిని […]
కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు న్యాయస్థానం జరిమానా విధించింది. 2022 జులై 1న హనుమకొండలోని భాజపా కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన ఘటనలో అనిల్ అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణలతో పాటు మొత్తం 13 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. హనుమకొండ జిల్లా మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో […]
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాస్త కోలుకుని మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం గ్రామానికి వచ్చారు. ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించడంతో హైదరాబాద్ ఏఐజీ […]