విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూన్ 20 : ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీల కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు తు.తు. మంత్రంగానే దర్యాప్తు చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ కేసులో నేరంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తుల జోలికి పోలీసులు ఇప్పటికీ పోలేదంటే దర్యాప్తు ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో రౌడీషీటర్ కోలా వేంకట హేమంత్ గర్ల్ ఫ్రెండ్ శుభాలక్ష్మి అత్యంత కీలకం. కిడ్నాప్ ద్వారా హేమంత్ పొందిన సొమ్ములో 40 లక్షల […]
విశాఖపట్నం, న్యూస్ లీడర్ సంచలనం కలిగించిన ఎంవీవీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీల కిడ్నాప్ వ్యవహారం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. వీని డబ్బు కోసం బంధించారా? లేదా మరేదయినా సెటిల్మెంట్ కోసం బంధించారా? విచారణలో ఏమి తేలిందన్నది పోలీసులు ఇప్పటికీ స్పష్టంగా వెల్లడిరచలేదు. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ జరిగింది అని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విశాఖ పోలీస్ కమీషనర్ త్రివిక్రమ వర్మ ఈ సంఘటనపై మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రజలకు, పలు […]
బాలేశ్వర్, న్యూస్‌లీడర్, జూన్ 3: ఒడిశా రైలు ప్రమాద ప్రాంతం భయానకంగా మారింది. ఎటు చూసినా బాధుతుల ఆర్తనాదాలతో ఆ పరిసరాలు మార్మోగుతున్నాయి. కుప్పలుగా పడిఉన్న మృతదేహాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బాధితులను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. ప్రమాదంలో గాయపడిన బాధితుల బాధ వర్ణనాతీతంగా మారింది. బాధను పంటిబిగువున భరిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రైలుప్రమాదంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంబులెన్స్‌ల సైరన్లతో భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. 14 యూనిట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులకు సాయం చేస్తున్నాయి. […]
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూన్ 2 : మీ పేరు ముందు ‘డాక్టర్’ ఉండాలను కుంటున్నారా? అందుకు మీరు కష్టపడి ఏ పరిశోధన చేయవలసిన అవసరం లేదు. కేవలం పది వేలు రూపాయలు చెల్లించుకుంటే చాలు. మీకు క్షణాల్లో గౌరవ డాక్టరేట్ వచ్చేస్తుంది. విశాఖ నగరంలో యథేచ్ఛగా సాగుతున్న వ్యాపారం ఇది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం సారథ్యంలో ఈ దందా సాగుతోంది. దీనికోసం నగరంలోని సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజీని అడ్డాగా […]
` నేడు విశాఖపట్నంలో సంస్మరణ సభ ప్రొఫెసర్ అల్లం అప్పారావు. జేఎన్టీయూ (కాకినాడ) తొలి వైస్ ఛాన్సలర్. లెక్కల డొక్క చించినవాడు. బోలెడన్ని రంగాలపై పట్టుంది. మనుషులంటే ప్రేముంది. చదువంటే చెవి కోసుకునే మోజుంది. రాతంటే మక్కువ.. 2008, మార్చిలో అనుకుండా. ఆయన దగ్గర చదువుకున్న ఓ యువ శాస్త్రవేత్త గెదెల శ్రీనుబాబు హైదరాబాదులో సెమినార్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ప్రొఫెసర్ అప్పారావు గెస్ట్‌గా వచ్చాడని తెలిసి, చూద్దామని నేనూ వెళ్లా. అప్పుడు నేను ‘సాక్షి’లో ఉన్నా. […]
(ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా..) అమృతం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే, పాలలా ఉంటుందని చెప్పేయవచ్చు. మాధుర్యానికి మాధుర్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం! పాలు ఆరోగ్యాన్ని సంరక్షించే పరిపూర్ణ పౌష్ఠికాహారం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్.. అంటూ అందరి పొట్టా నింపేస్తాయి. పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి.. అన్ని రూపాల్లోనూ శరీరానికి పోషకాలను అందిస్తాయి. ప్రపంచ పాల దినోత్సవం ఏ కారణం వల్ల జరుపుకుంటున్నామో తెలుసా? ప్రపంచ మానవాళి లో పోషకాహార ప్రధాన […]
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, మే 30: ప్రతిపక్ష నేత చంద్రబాబు వెనుక కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బాబుకు బ్లాక్ కమెండోలు అవసరంలేదు.. ఉపసంహరించమని కోరుతానంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బ్లాక్ కమెండోల్ని ఉపసంహరించడం ద్వారా చంద్రబాబాబుని భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతోందనే వాదన విన్పిస్తోంది. ఏపీ స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బ్లాక్ కమెండోలు రక్షణ అవసరమా..ఆ భద్రత తీసేస్తే ఆయన ఫినిష్. వెంటనే […]
భారతదేశ అరేబియన్ నైరుతి తీరప్రాంత గోవా రాష్ట్రం దక్కన్ పీఠ భూమిగా పశ్చిమ కనుమలతో వేరు చేయబడి ఉంది. ‘పనాజీ’ కేంద్రంగా కోంకన్ అధికారిక భాష మాట్లాడే గోవా ప్రాంతం ప్రకృతి రమణీయతలకు, బీచ్‌ల కమనీయ విందులకు ప్రసిద్ధి గాంచింది. ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమ, దక్షిణాన కర్నాటక, పశ్చిమాన సముద్ర తీరప్రాంతంగా పర్యాటకులకు స్వర్గతుల్యంగా నిలుస్తున్నది. 15 ఆగష్టు 1947న స్వాతంత్య్రం పొందినప్పటికీ గోవా మాత్రం పోర్చుగీస్ పాలనలోనే కొనసాగింది. ఆపరేషన్ విజయ్‌తో విముక్తం.. 450 ఏండ్ల […]
(మే 30న 6వ వర్థంతి సంథర్భంగా..) […]
పత్తికొండ, న్యూస్‌లీడర్, మే 29: మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పత్తికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత భార్యాభర్తలు. వీరిద్దరూ మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డారు. […]