వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ చివరి సిరీస్‌లో పరస్పరం తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు జరిగే 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగే నేటి మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధంగా ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపిస్తుండగా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా రెగ్యులర్ […]
గృహహింస కేసులో అరెస్టును ఎదుర్కొంటున్న మహ్మద్ షమీ, అతని సోదరుడు మహ్మద్ హసీమ్, ఇతర సభ్యులకు కోల్‌కతాలోని ACJM కోర్టు మంగళవారం 2000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, రాబోయే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో షమీ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లోనూ షమీకి చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ప్రపంచ కప్ కంటే ముందు టీమిండియా అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ […]
ఆసియా కప్ 2023 చివరి మ్యాచ్ గెలిచిన తర్వాత, టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు జట్టుకు రాబోయే సవాలు ఆస్ట్రేలియాతో 3 వన్డే సిరీస్ రూపంలో వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే ముంబై చేరుకున్నాడు. మ్యాచ్ ముగింపు సమయంలో రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి వన్డే సిరీస్ కోసం తన జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఇందులో చాలా మార్పులు కనిపించాయి. ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే […]
ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత్ ప్రత్యర్థిగా శ్రీలంక నిలిచింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) ఓడించిన శ్రీలంక ఆసియా కప్ హిస్టరీలో 12వ సారి ఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచులో చివరకు శ్రీలంకనే గెలుపొందింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మ్యాచును తొలుత 45 ఓవర్లకు ఆపై […]
ఆసియా కప్‌లో వరుసగా మూడో రోజూ భారత్‌దే… సోమవారం పాక్‌పై విజయానందాన్ని కొనసాగిస్తూ మంగళవారం కూడా మరో విజయాన్ని టీమిండియా తమ ఖాతాలో వేసుకొని ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై శ్రీలంక స్పిన్నర్ల ధాటికి తడబడి 213 పరుగులకే పరిమితమైనా… మన బౌలింగ్ బలగంతో ఆ స్వల్ప స్కోరును కూడా కాపాడుకోగలిగింది. కొంత వరకు పోరాడగలిగినా చివరకు లంకకు ఓటమి తప్పలేదు. సూపర్–4 దశలో వరుసగా రెండో విజయంతో భారత జట్టు ఆసియా […]
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను టీమ్ఇండియా చిత్తు చేసింది. వర్షం కారణంగా రెండు రోజులపాటు సాగిన వన్డే మ్యాచ్‌లో ఫలితం భారత్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2023 సూపర్ -4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 356 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 32 ఓవర్లలో 128/8 […]
ఆసియా కప్-2023లో భారత్, పాక్‌లను వర్షం వెంటాడుతూ ఉంది. టోర్నీలో జరగాల్సిన గ్రూప్ లెవెల్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. సూపర్-4 దశలో జరగాల్సిన మ్యాచ్ రిజర్వ్ డే (ఈరోజుకి) వాయిదా పడింది. రిజర్వ్ డే రోజున అయినా మ్యాచ్ సాఫీగా సాగుతుందా అంటే అది చెప్పలేని పరిస్థితి. కొలొంబో వాతావరణ శాఖ వారి హెచ్చరికల ప్రకారం రేపు 99 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. దీనికి తోడు భారత్‌కు రిజర్వ్ డే […]
ఆసియా కప్‌లో మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. ‘సూపర్ 4’ దశలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ఈ నెల 2న భారత్, పాక్ తలపడిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. దాంతో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని నేటి మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ను కేటాయించారు. అయితే ఆదివారం నగరంలో 90 శాతం వర్షసూచన ఉండగా…సోమవారం కూడా పరిస్థితి […]
భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది. ఆ వీడియోలో అభిమానులకు గౌతమ్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసహనం వ్యక్తం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం మరింత వివాదాస్పదం అవడం, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. తాజాగా గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ వీడియోపై […]
ఆసియా కప్ 2023లో టీమిండియా నేడు క్రికెట్ పసికూన నేపాల్‌తో ఏకపక్ష పోటీకి సిద్ధమైంది. ఏ ఫార్మాట్లోనైనా నేపాల్ జట్టుతో భారత్‌కిది తొలి మ్యాచ్ కానుంది. భారత్‌లాంటి మేటి జట్టుకు ఈ మ్యాచ్ ఓ లెక్కేకాదు. అయితే ఎవరెంతగా చెలరేగుతారనేదే ఇక్కడ ఆసక్తికరం. కానీ ఇదంతా కూడా మ్యాచ్ జరిగితేనే! ఎందుకంటే వరుసగా భారత్ ఆడే ఈ రెండో మ్యాచ్‌పై కూడా వరుణ ప్రతాపం ఉంది. ఈరోజు కూడా వర్షం పడే అవకాశాలే ఎక్కువని వాతావరణ కేంద్రం […]