ఎర్రమట్టి దిబ్బలు కాపాడుకుంటాం వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే.. గ్రీన్ ట్రైబ్యునల్ వరకు వెళ్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 16: భీమునిపట్నం మండలంలో ఎర్ర దిబ్బలు చారిత్రార్తకమైనవని, ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని బుధవారం సాయంత్రం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు […]
దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశాఖ విశాఖలో ‘ఇండియా విజన్ 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణలో చంద్రబాబు విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 15: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విశాఖలో సద్భావన యాత్రలో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు త్రివర్ణ పతాకం చేతబూని ఉత్సాహంగా నడిచారు. విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఇండియా విజన్ 2047’ డాక్యుమెంట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుపై […]
స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో అన్యాయం కాళ్లరిగేలా తిరుగుతున్న బాధిత కుటుంబాలు విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: విధి నిర్వాహణలో మృతిచెందిన స్టీల్‌ప్లాంట్ కార్మికుల కుటుంబాలకు సకాలంలో ‘వర్క్‌మెన్ కాంపన్సేషన్’ అందజేయడంలో కార్మిక శాఖ విఫలమవుతోంది. ఇంటి పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మృతుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం వీలైన త్వరలో కాంపన్సేషన్ అందించాల్సింది పోయి నెలల తరబడి కార్మిక శాఖ నిర్లక్ష్యం చేస్తోంది. తమకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం డిపాజిట్‌గా […]
విశాఖలో పోలీసుల ఆంక్షలపై ప్రశ్నించిన జనసేనాని పవన్ పెందుర్తిలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శ పెందుర్తి, న్యూస్‌లీడర్, ఆగస్టు 12: విశాఖలో ఓ వృద్ధురాల్ని వలంటీర్ చంపేస్తే అధికార పక్షం నుంచి స్పందనే లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ సమయంలో వృద్ధురాలి కుటుంబానికి జనసేన నేతలు అండగా నిలిచారని గుర్తు చేశారు. వారాహి విజయ యాత్ర`3లో భాగంగా పవన్ విశాఖలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పెందుర్తిలో వలంటీర్ […]
నవరత్నాల కోసం వలంటీర్లను నియమిస్తే వాళ్లు ప్రాణాలు తీస్తున్నారు విశాఖను నేరాలకు అడ్డాగా మార్చిన వైసీపీ విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 12: ఏపీలో వైసీపీ పాలనపై జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు. వలంటీర్ల వ్యవస్థను దండుపాళెం బ్యాచ్‌గా చెప్పుకొచ్చారు. విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ శనివారం పెందుర్తి సుజాతనగర్లో ఇటీవల వలంటీర్ చేతిలో హత్యకు గురైన కోటగిరి వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల […]
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 12: గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేన నేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి సమాయత్తమయ్యారు. తొమ్మిది రోజుల పర్యటన కోసం విశాఖ వచ్చిన పవన్ ఆదివారం గాజువాక వెళ్తుండడం పట్ల అందరిలో ఆసక్తి మొదలైంది. వైసీపీ తరపున పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై ఘోరంగా ఓటమిపాలైన పవన్ నాలుగేళ్ళలో ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గం వేపు కన్నెత్తికూడా చూడలేదు. గాజువాకలో ఓటమి పవన్‌కు […]
విశాఖలో కాలిబూడిదైన వాహనం ఆరిలోవ, న్యూస్‌లీడర్, ఆగస్టు 11: విశాఖ జాతీయ రహదారిపై ఓ కారు కాలిబూడిదైంది. వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆస్పత్రి దాటాక, పండ్ల దుకాణాల సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45గంటల సమయంలో ఓ వాహనం అగ్నికి ఆహూతైంది. నడిరోడ్డుపై వాహనం మంటల్లో చిక్కుకోవడం చూసి అక్కడివారు బెంబేలెత్తిపోయారు. దట్టంగా పొగలు కమ్మేయడం, భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో దూరం జరిగారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తులు బయటకు దూకేశారని అక్కడి వారు చెబుతున్నారు. షార్ట్‌సర్క్యూట్ […]
వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 11: విశాఖ పెద్దాస్పత్రిలో శుక్రవారం ఉదయం ఒక శిశువు మృతి చెందింది. వైద్యులు కనీసం పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రోజుల వయస్సున్న పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పాలకొండకు చెందిన ఎం.శిరీష్, చంద్రశేఖర్ దంపతులకు వారం రోజుల క్రింత పాప జన్మించింది. జీర్ణశక్తి సమస్య తలెత్తడంతో కేజీహెచ్‌కు తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సిఫారుసు చేశారు. […]
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు ఎన్ఏడీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 10: విశాఖ విమానాశ్రయం చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు గురువారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి, వారాహి యాత్రలో పాల్గొనేందుకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ […]
ఏపీలో తొలిసారిగా 126 మంది అత్యుత్తమ గోల్ఫ్ క్రీడాకారులతో సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు పోటీలు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎం.సత్యనారాయణ రాజు విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌లోని మొటమొదటిసారిగా విశాఖలో ఫ్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) ‘వైజాగ్ ఓపెన్’ టోర్నమెంట్ నిర్వహిస్తోందని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎం.సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. ముడసర్లొవలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన […]